[ad_1]
Ee Prema Song Lyrics in telugu written by jaithrankumar music composed by mark prashanth ee prema song sung by singer haricharan from latest telugu movie nilakanta
Song Credits:
Song Name : Ee Prema
Music: Mark Prashanth
Singer: Haricharan
Lyrics: Jaithran Kumar
Song: Ee Prema Telugu
Label: Aditya Music India
Ee Prema Song Lyrics in Telugu
మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం
మళ్ళీ మళ్ళీ తాకేనే ఎదసడిలా
చేపకు విసిరిన ఓ వలలా
ఒడ్డునే తాకిన
సంద్రపు అలల
కలలో మెదిలే కల్లోలమే కదా
ఈ ప్రేమా
నా ఎదలో కదిలే
సంగీతమే కదా ఈ ప్రేమా
మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం
తొలి తొలి చూపే
అది తొలకరి చినుకే
మదినే మీటే
నువ్ పలికితే పలుకే
కొత్తగ సరిగమ రాగాలే
మోగాయి ఎదలో నీవలన
వింతగా కవ్వించే వయసెన్నడు
చూడని అద్బుతమే
కదా ఈ ప్రేమా
స్నేహం దాటితే చెలి లోకమే
కదా ఈ ప్రేమా
మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం
పదనిస పలికే
అది ప్రాయం పిలుపే
హృదయం కదిలే
సరిహద్ధులు దాటే
బిడియంతో చెదిరిందా మౌనం
ఎద బరువై అడిగిందా సాయం
ఇది వరకు ఎరుగని తపనతో
సొగసుని తడిపే తాపమే
కదా ఈ ప్రేమా
సఖి రూపం మరువని శాపమే
కదా ఈ ప్రేమా
మెరుపే మైమరుపే
తాకిందే ఈ క్షణం
మనసే నా మనసే
తేలిందే ఈ క్షణం
Ee Prema Song Video
[ad_2]